కొండ లక్ష్మణ్ బాపూజీ పోరాటం మరువలేనిది.. కమిషనర్ రవీంద్ర రెడ్డి
నాగార్జునసాగర్ (నందికొండ); జనం సాక్షి, సెప్టెంబర్ 27; నాగార్జునసాగర్ నందికొండ మున్సిపల్ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా నందికొండ మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమం సహా అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. బాపూజీ పోరాటాలు మరువలేనివి అని పేర్కొన్నారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్ (బిన్నీ) మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాక ముందే కాకుండా వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో బాపూజీ ముందంజలో ఉన్నారని గుర్తు చేశారు. ఉద్యమంలో తానూ పోరాటం చేయడమే కాకుండా,పోరాట యోధులకు సహకారం ఆయన అందించారని తెలిపారు. నందికొండ 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ మాట్లాడుతూ ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమనాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో,ఏ జలదృశ్యం అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో,నేడు అక్కడే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నామని,తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేసెరని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందికొండ కౌన్సిలర్లు మంగత నాయక్,నిమ్మల ఇందిరా, నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ ప్రత్యేక సలహాదారుడు కర్ణ అనూష శరత్ రెడ్డి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నందికొండ అధ్యక్షుడు శిరీష మోహన్ నాయక్, స్వామి లఘుపతి, తదితరులు పాల్గొన్నారు.