కొందరు స్వార్ధపరులు బట్టకాల్చి మీదేయాలని చూస్తుండ్రు-సెస్ చైర్మన్ చిక్కాల రామారావు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 13. (జనంసాక్షి). కొందరు సెస్ పాలకవర్గంపై బట్ట కాల్చి మీదేయాలని చూస్తుండ్రని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్) కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం సంఘటన స్థలాన్ని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తోపాటు సెస్ ఎండి సూర్యచంద్రరావు పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. ప్రమాదంలో ఖాళీ బూడిదైన ఫైళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన అగ్ని ప్రమాదం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బట్ట కాల్చి మీదేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకవర్గం పక్షాన ఎండి నుంచి ఫిర్యాదు తీసుకుని విచారణ కోసం పంపించినున్నట్లు తెలిపారు. ప్రమాదంలో విలువైన సమాచారం పోలేదని కొనుగోళ్లకు సంబంధించి ఆడిట్ అయిపోయిన ఫైల్ కాలిపోయాయి అన్నారు. భారతదేశంలోని ప్రతిష్టాత్మకంగా సహకార రంగంలో సేవలు అందిస్తున్న అతిపెద్ద సంస్థ పై తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు. ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయి విషయాలను త్వరలోనే మీడియా ముఖంగా ప్రకటిస్తామని తెలిపారు