కొత్తగూడ గురుకులంలో కోవిడ్ కలకలం

కొత్తగూడ జూలై 30 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్(కొత్తగూడ)గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో కరోనా కలకలం…గురుకులంలో చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు నీరసంగా,జ్వరం రావడంతో తక్షణమే స్పందించి ప్రధానోపాధ్యాయురాలు వెంటనే వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టెస్ట్ చేయించగా ఇద్దరు పిల్లలకు ఒక ఉపాధ్యాయురాలుకు పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని ఆర్ బి ఎస్ కే డాక్టర్ మౌనిక తెలిపారు.అనంతరం మాట్లాడుతూ పిల్లలు ధైర్యంగా ఉండాలని మంచి ఆహారం,వేడి నీళ్లు సేవించడం ద్వారా తొందరగా తగ్గుతుందని పిల్లలకు చెప్పడం జరిగింది.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సానిటైజర్,మాస్కులు వాడాలని సూచించారు.గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ ను వివరాలు అడగగా పిల్లలకు వచ్చిన మాట వాస్తవమే అని తెలిపారు.పిల్లలకు ధైర్యం చెప్పడం జరిగిందని,మంచి ఆహారం అందించడం జరుగుతుందని,ప్రత్యేక రూమ్ లో ఉంచడం జరిగిందని తెలిపారు.

తాజావార్తలు