కొత్తపల్లి గ్రామంలో కార్డెన్ అండ్ సర్చ్ 30 మోటార్ సైకిళ్ళు స్వాధీనం
…ఏసిపి డి రఘు చందర్
స్టేషన్ ఘన్పూర్, జూన్ ,( జనం సాక్షి ), మండలం లోని కొత్తపల్లి గ్రామంలో స్టేషన్ ఘన్పూ ర్ సబ్ డివిజన్ పోలీసువారి ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించడం జరిగిందని,ఈ తనిఖీ ల్లో భాగంగా సరైన పత్రాలు లేనటువంటి30వాహ నాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఏసీపి డి రఘుచందర్ అన్నరు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిం చి ఏసీపి రఘుచందర్ మాట్లాడుతూ వాహనదా రులు తప్పకుండా లైసెన్స్ ఇన్సూరెన్స్,కలిగి ఉండాలని అదేవిధంగా ప్రతిఒక్కరూ రోడ్డుపై వెళ్తు న్నప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. సూచించడం జరిగింది.అదేవిధంగా గ్రామ ప్రజలు మీ యొక్క OTP నంబర్లు ఎవ్వరికి కూడా చెప్ప వద్దు ఎందుకంటే ఏ బ్యాంక్ వాళ్ళు కూడా పిన్ నంబర్లు చెప్పమని అడగరని,సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని అన్నారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా 4జి అనగా గంజాయి, గుడుంబా, గ్యాంబ్లింగ్, గుట్కా లాంటి చెడువ్యసనాలకు బానిస కావద్దని, యువత గంజాయి లాంటి చెడువ్యసనాలకు అల వాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవ డం జరుగుతుంది కావున తల్లిదండ్రులు వారిని గమనించాలని కోరారు. ఊరికి చివరన ఇండ్లు కలిగినవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఏదై నా శుభకార్యాలకు,దూర ప్రయాణాలు చేయ దల చినవారు మీయొక్క విలువైన వస్తువులను జాగ్ర త్త పరుచుకుని వెళ్ళాలనిఅన్నారు.ఈకార్యక్రమం లో సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి,ఎస్ఐ శ్రీనివాస్, చిల్పూర్ ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన డం జరిగింది. |