కొత్త తండా పాఠశాలకు 14 డబుల్ డెస్క్ బెంచీలు వితరణ
కాన ఫౌండేషన్ ఇండియా సహకారంతో చేయూత
టేకులపల్లి, అక్టోబర్ 21( జనం సాక్షి): టేకులపల్లి మండలం కొత్త తండా(గొల్లపల్లి) ప్రాథమిక పాఠశాల కు విద్యార్థుల సౌకర్యార్థం కోసం “తానా ఫౌండేషన్ ఇండియా”వారి సహకారంతో “చేయూత” కార్యక్రమం ద్వారా తానుగుంట్ల శిరీష ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంస్కృతిక కోఆర్డినేటర్ సహాయ సహకారాలతో 14 డబుల్ డెస్క్ బెంచ్ లు వితరణగా శుక్రవారం పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భముగా కొత్త తండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి బాలు అధ్యక్షతన జరిగిన సభలో మండల విద్యాశాఖ అధికారి రామ్ సింగ్ ఠాకూర్ విశిష్ట అతిథిగా హాజరై వారి సమక్షంలో తానా ఫౌండేషన్ ఇండియా ఆర్గనైజేషన్ సభ్యులు బెంచ్ లను అందించారు. పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి వెనుకబడిన గిరిజన ప్రాంతంలోని పాఠశాల అభివృద్ధి కోసం సహకారం అందిస్తున్న తానా ఫౌండేషన్ ఇండియా సంస్థకు అభినందన తెలియపరుస్తూ భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేపట్టి ఎన్నో మన్ననలను పొందాలని, అలాగే తూనుగుంట్ల శిరీష పాఠశాలకు అందించిన ఈ సహకారం మరువలేనిది అని కొనియాడారు. తానా ఫౌండేషన్ ఇండియా తరపున ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీ మెట్టపల్లి పాండురంగయ్య రావు మాట్లాడుతూ పాఠశాలకు బెంచీలు సరఫరా చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని, భవిష్యత్తులో విద్యార్థులు మంచి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి హోదాలో ఉండి సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడాలని విద్యార్థులను ఆశీర్వదించారు.ఈ సభలో గ్రామ సర్పంచ్ కుమారుడు పూల్ సింగ్ మాట్లాడుతూ తానా ఫౌండేషన్ ఇండియా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు అభినందలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తానా ఫౌండేషన్ సభ్యులైన మిట్టపల్లి పాండురంగారావుని పాఠశాల యాజమాన్య కమిట