కొత్త పెన్షన్ల కోసం ఎన్నేళ్లు ఎదురుచూపు.

 

నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా

జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్

మల్దకల్ జూలై 21 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా గురువారం నడిగడ్డ హాక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా శిబిరంలో జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ
అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ముడెకరాల భూ పంపిణీప్రతి దళిత కుటుంబానికి దళిత బంధును ఇవ్వాలని,ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని కోరారు.
రాష్ట్రం ఏర్పడ్డాక నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయని ఆశపెడ్డ వారికి నిరాశే మిలిగిందని ప్రభుత్వ పథకాలలో కూడా రాజకీయాలు చేస్తున్నారని ఇప్పటికీ ఆయా గ్రామాలలో పింఛన్లు ఇవ్వాలన్న కూడా రాజకీయాలు చేస్తున్నారని, ఒకవైపు ముఖ్యమంత్రి పింఛన్లు ఇస్తూ ఇంటికి పెద్దన్నగా వ్యవహరిస్తానని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అర్హులైన వారందరికీ వృద్యాప,వితంతు,ఒంటరి మహిళ,వికలాంగుల పింఛన్లు అందడం లేదని కావున వెంటనే అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని అన్నారు.కేవలం ఎన్నికలప్పుడు మాత్రం ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ ఓట్లు వేయించుకునే నాయకులు ఇప్పుడు మాకు పథకాలు అందకుంటేఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు? బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రభుత్వ పథకాలకు సైతం మీ ఇళ్ల కాడ కాపలాకాయాల్సిన పరిస్థితి ఎందుకని వచ్చిందన్నారు. ధర్నా తదనంతరం పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని,దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి వర్తింపజేయాలని,ప్రతి దళితునికి మూడెకరాల భూ పంపిణీ చేయాలని ఎమ్మార్వో కు అర్హులైన వారందరికీ పింఛన్లు వెంటనే అందజేయాలని ఎంపీడీవోకు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు,జిల్లా కార్యదర్శి లవన్న,మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు,కార్యదర్శి,ఉలేగెపల్లి తిమ్మప్ప, అవనిశ్రీ, ప్రేమరాజ్,ఉప్పరి కృష్ణ, హానుమేష్,లక్ష్మన్న,మీసాల కృష్ణన్న,చిన్నరాముడు,రమేష్, గోపాల్, కృష్ణ,గుండన్న, కృష్ణ,ఆశన్న రాజు,అంజి, నేతన్న,తిమ్మప్ప,సవరాన్న, మండలాల నాయకులు వెంకట్ రాములు,నరేశ్,ఉలిగెప్ప, వెంకటేష్,జమ్మన్న,రఘుపతి తదితరులు పాల్గొన్నారు.