కొత్త మద్యం పాలసీపై నిరసన చేపట్టిన బీజేపీ, టీడీపీ
వరంగల్,(జనంసాక్షి): కొత్త మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ హన్మకొండలో బీజేపీ మహిళ మోర్పా భారీ ప్రదర్శన నిర్వహించింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడించి, మద్యం సీసాలను ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ వరంగల్ తహసీల్దార్ కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. కార్యాలయం ఎదుట ఎంపీ గుండు సుధారాణి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.