*కొమురం భీం విగ్రహానికి నివాలర్పించిన మున్సిపల్ చైర్మన్…గండ్రత్ ఈశ్వర్
నిర్మల్ బ్యూరో, అక్టోబర్09,జనంసాక్షి,,, స్వయం పాలన, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మన్యం వీరుడు ఉద్యమ యోధుడు కొమురం భీమ్ 82 వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్
కార్యాలయం ఎదురుగా మరియు చైన్ గెట్ ప్రాంతంలో ఉన్న కొమురం భీమ్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పూల మాలవేసి నివాలర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జల్,జమీన్,జంగిల్,అనే నినాదంతో స్వయం పరిపాలన,ఆదివాసుల హక్కుల సాధన కోసం కొమురం భీమ్ అలుపెరుగని పోరాటం చేశారన్నారు.రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో గిరిజనులు, ఆదివాసుల కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో వారిని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నాం అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆదివాసీల కొరకు ఆదివాసులు,గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.జోడే ఘాట్ లో రూ.25 కోట్లతో ఆదివాసీల ఆరాధ్య దైవం ,మన్యం వీరుడు కొమురం భీమ్ స్మారక మ్యూజియాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
Attachments area