కొలెస్ట్రాల్ ఉల్లిపాయ తింటే తగ్గుతుందా..!?
కొలెస్ట్రాల్ అనేది మన శరీరపు టిష్యూస్ మధ్య ఏర్పడే తెల్లగా ఉండే ఒక కొవ్వు పదార్థం.. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది రక్తప్రవాహన్ని అడ్డుకుని గుండె జబ్బులకు దారి తీస్తుంది.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుకోవాలంటే నిత్యం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడంతో పాటు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి.. కొలెస్ట్రాల్ తగ్గించే వాటిలో ఉల్లిపాయలు కూడా ఒకటి.. వీటిని ఏ విధంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందొ ఇప్పుడు చూద్దాం..!!
ఎర్ర ఉల్లిపాయలు ఇలా తీసుకోండి..
ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఉల్లి లో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనే పాలి ఫినాలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్ లో సహజంగానే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. సైంటిస్టులు చేసిన అధ్యయనాల ప్రకారం బ్రిటిష్ జనరల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉల్లిపాయ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మన శరీరంలో ఉండే లో డెన్సిటీ లిపో ప్రొటీన్స్ LDL అనే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయని తేలింది. ఎల్ డి ఎల్ శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే గుండె జబ్బులు వస్తాయి. ఉల్లి లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుండె జబ్బులు రాకుండా చేస్తాయి.
ఎర్ర ఉల్లిపాయలు శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి ప్రతిరోజూ తినడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుందని శాండ్విచ్, ఇతర ఆహారం లో ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనం రోజూ తీసుకునే భోజనంలో ఒక ఉల్లిపాయను ఖచ్చితంగా తినాలి చెబుతున్నారు. మజ్జిగ లేదా పెరుగు లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తినడం వలన కూడా శరీరం లో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ప్రతి రోజు ఉల్లిని ఏదో విధంగా తీసుకోండి. కొలెస్ట్రాల్ తో పాటు బరువు కూడా తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడితే మన ఆరోగ్యం మనమే కాపాడుకోవచ్చు.