కొల్లూరు లో ఘనంగా గాంధీ జయంతి
ఝరాసంగం (జనం సాక్షి) మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు కార్యక్రమంలో గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం యూత్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సావిత్రి బస్వరాజు పాటిల్ , యువ నాయకులు చింతలగట్టు శివురాజ్, ఎంపీటీసీ లక్ష్మీ రాజుకుమార్, తెరాస నాయకులు నర్సిములు, వార్డు సభ్యులు నాగేష్, విశ్వనాథ్,పిల్డ్ అసిస్టెంట్ శుభకర్ గ్రామ ప్రజలు అనిల్, తదితరులు పాల్గొన్నారు.