కోడెల బహిరంగ వేలం నిలిపివేయాలని అధికారుల నిర్ణయం

వేములవాడ, జూలై 5 (జనంసాక్షి) :

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించే కోడెల బహిరంగ వేలాన్ని నిలిపివేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయించారు. గత కొన్ని సంవత్స రాలుగా దేవస్థానానికి భక్తులు తాము మొక్కుకున్న స్వంత కోడెలను మొక్కు బడి కింద సమర్పించడం అనాదిగా రాజన్న ఆలయంలో సాంప్రదాయంగా వస్తున్న ఆచారంగా పరిగణిస్తున్నారు. ఆలయానికి భక్తుల ద్వారా వచ్చే కోడెల లో దేవస్థానం వారు కొన్నింటిని ఉంచుకొని మిగతా వాటిని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నారు. కాగా రైతుల ముసుగులో కోడెలను కొనుగోలు చేస్తు న్న కొందరు దళారులు ఈ కోడెలను కబేళాలకు తరలిస్తున్నారని పలు ఆరో పణలు రావడం, దీనికి సంబంధించి కోడెల విక్రయాలు నిలిపివేయాలని వివి ధ సంస్థలు ఆందోళనలు నిర్వహించడంతో ఈ బహిరంగ వేలం గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారుతోంది. కాగా గత 20 రోజుల క్రితం సుమా రు 30కి పైగా రాజన్న కోడెలను వేములవాడ నుండి తరలిస్తున్న ఓ దళారీని స్థానిక ఏబీవీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పట్టణ శివారు లో పట్టుకొని తీవ్రంగా చితకబాదడం, దీనిపై వివిధ పత్రికల్లో కబేళాలకు తరలిస్తున్న కోడెలపై పలు కథనాలు రావడంతో గురువారం నాడు దేవస్థానం చాంబర్‌లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పుర ప్రముఖులతో ఆల య అధికారులు సమావేశం నిర్ణయించారు. ఈ.ఓ. అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తహసీల్‌దార్‌ రామకృష్ణారెడ్డి, విశ్వహిందూ పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వూట్కూరి రాధాకృష్ణారెడ్డి, స్థానిక విహెచ్‌పి నాయ కులు డాక్టర్‌ మధురాధాకిషన్‌, గర్శకుర్తి వెంకటేశ్వర్లు, వేముల సత్యం, మాతృ మండలి సభ్యులు బూరుగు అరుణ, ర్యాకం భాగ్యలక్ష్మి, బీజీపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, కాంగ్రెస్‌ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, నరాల పో చెట్టి, చిలుక రమేశ్‌, సాగరం వెంకటస్వామి, మాజీ ధర్మకర్త నందిపేట సుదర్శన్‌యాదవ్‌, జేఏసీ నాయకులు నేరెళ్ళ తిరుమల్‌ గౌడ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆల యానికి సమర్పించిన కోడెలను వేలం ద్వారా విక్రయించకుండా, పేద రైతులకు ఉచితంగా ఇవ్వాలని పలువురు సూచించారు. దీంతో కోడెల బహి రంగ వేలాన్ని నిలిపివేసి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌కు తెలియ జేయనున్నట్లు ఈ.ఓ. అప్పారావు పేర్కొన్నారు.
కోడెల భద్రతపై అధికారుల నిర్లక్ష్యం :

వేములవాడ పుణ్యక్షేత్రంలో భక్తులు సమర్పిస్తున్న కోడెల భద్రత, సంరక్షణపై ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో అవి కబేళాలకు తరలిపోతున్నాయని జిల్లా విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి వూట్కూరి రాధాకృష్ణారెడ్డి ఆరోపించారు. భారతీయ పశు సంవర్ధక చట్టం 1977 ప్రకారం గోవులను, పశువులను వధించడం నేరమని, కాగా బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్న రాజన్న కోడెలు కబేళాలకు తరలకుండా జాగ్రత్త వహించాల్సిన ఆలయ అధికారులు రైతుల ముసుగులో వచ్చే దళారులకు విక్రయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు సమర్పించే కోడెలను దేవస్థానం వారు ధార్మిక సంస్థలకు గానీ, రైతులకు గానీ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాజన్న ఆలయానికి కోడెల ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం కోడెల సంరక్షణకు వినియోగించాలని సూచించారు. బహిరంగ వేలాన్ని నిలిపివేసి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.