కౌన్సిలర్ యమున కుటుంబాన్ని కిషోర్ రెడ్డి పరామర్శ
తొర్రూరు 10 అక్టోబర్ (జనంసాక్షి )
మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ పేర్ల యమున జంపన్న తండ్రి నార్కుటి అబ్బస్వామి గత రెండు రోజుల క్రితం దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందారు.దీంతో విషయం తెలుసుకున్న రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ రామసహాయం కిషోర్ రెడ్డి సోమవారం మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ లో ఉన్న ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ల మండల అధ్యక్షుడు నల్గురి రామలింగం,కౌన్సిలర్ తూర్పాటి సంగీత రవి,ఎంబీసీ జిల్లా అధ్యక్షుడు మహాకాళి భూపతి కుమార్,నాలుగో వార్డు కార్యదర్శి పత్తి శ్రీనివాస్,ఉప్పలయ్య,యాకన్న మహంకాళి సాయిమల్లు,రాజా తదితరులు పాల్గొన్నారు.
—