క్రిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లు పొంచి ఉన్న ప్రమాదం

– ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు
– వేలాడుతున్న తీగలు
–  విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
మద్దూరు (జనంసాక్షి) జులై 18 : మద్దూరు మండలంలోని లద్దునూరు గ్రామంలో గత/ఆరు నెలల క్రితం గాలి దుమారం వల్ల 11 కేవీ విద్యుత్ స్తంభాలు ఒరిగి తీగలు క్రిందికి వేలాడుతున్నాయి. విద్యుత్‌ తీగలను మార్చాలని ట్రాన్స్‌కో అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది.
ఈ సందర్భంగా రైతు తలారి రామస్వామి, నంద ఎల్లయ్య విలేకరులతో మాట్లాడుతూ.. గత ఆరు నెలల క్రితం గాలి దుమారం వల్ల విద్యుత్ పోల్ ఒరిగి తమ పొలంలో మనిషికి తగిలేటట్టు ఉన్నాయని, ఈ విషయాన్ని విద్యుత్ అధికారులు ఏఈ,ఏడికి ఫిర్యాదు చేసినా లూప్ లైన్ కింద ఒక పోల్ ను విద్యుత్ కాంట్రాక్టర్ తీసుకువచ్చి పొలములనే వేసి వెళ్ళిపోయాడని ఆ పోల్ నాటడానికి ఎన్నిసార్లు చెప్పినా రావడం లేదని, యాసంగి పొలం దున్నకుండనే వదిలిపెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్షాకాలం మరమ్మతు చేస్తారనుకుని నారు పోశామన్నారు. కానీ ఈసారి కూడా పొలము దున్నకుండనే వదిలిపెట్టడం జరిగిందన్నారు. పొలంలో కిందికి ఉండడం వలన పొలం దున్నడానికి ట్రాక్టర్ కు తగిలేటట్టు ఉన్నందున ట్రాక్టర్ వాళ్ళు రావడం లేదని, పొలము దున్నకుండనే వదిలిపెట్టడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎన్ని సార్లు విద్యుత్ అధికారులకు విన్నవించినా పట్టించుకునే నాధుడే లేడని విద్యుత్ అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కెనాల్ నుండి వెళ్లే దారిలో కూడా విద్యుత్ తీగలు మరి క్రిందికి వేలాడుతున్నా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనబడుతుంది. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.