క్వార్టర్స్లో ఎవరితో ఎవరు?
లంక x సౌతాఫ్రికా: ఈ నెల 18 న జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక, సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం గ్రూపు-ఎ మూడో స్థానంలో ఉన్న లంక, గ్రూపు-బిలో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా తలపడతాయి.
భారత్x బంగ్లా: ఈ నెల 19న జరిగే రెండో క్వార్టర్స్లో ఉపఖండం జట్లు భారత్, బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకున్నాయి. గ్రూపు-బి టాపర్ టీమిండియా, గ్రూపు-ఎ 4వ స్థానంలో ఉన్న బంగ్లా మధ్య పోరు జరుగుతుంది.
ఆసీస్ x పాక్: ఈ నెల 20న జరిగే మూడో క్వార్టర్స్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్లు తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం గ్రూపు-ఎ రెండో స్థానంలో ఉన్న ఆసీస్, గ్రూపు-బి మూడో స్థానంలో ఉన్న పాక్ పోటీపడతాయి.
కివీస్ x విండీస్: ఈ నెల 21న జరిగే చివరి, నాలుగో క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్, వెస్టిండీస్ తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం గ్రూపు-ఎ టాపర్ కివీస్, గ్రూపు-బి నాలుగో స్థానంలో ఉన్న విండీస్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.
24, 26న సెమీ ఫైనల్ మ్యాచ్లు, 29న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.