* క్షయ వ్యాధి పై అవగాహన సదస్సు*
శ్రీరంగాపురం: జులై 19 (జనం సాక్షి):
శ్రీరంగపురం మండల కేంద్రము లో ఈ రోజు క్షయ వ్యాధి పై అవగాహన సదస్సు నిర్వహిస్తూనా స్థానిక వైద్య అధికారి డాక్టర్ ప్రవాలీ మేడం గారు, ఇట్టి కార్యక్రమము ముఖ్య అతిథులు గా స్థానిక సర్పంచ్ శ్రీమతి గౌ.వినీల రాణి మేడం గారు మరియు మండల జెడ్పీటీసీ శ్రీ.గౌ.రాజేంద్ర ప్రసాద్ గారు మరియు సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్రీ.వెంకటయ్య గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మండలము లో టిబి రాకుండా ముందుగానే తేమాడ తీసుకొని అట్టి తేమాడలో టిబి ఉంటే వారికి ప్రభుత్వము ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని చెప్పినారు, గత కాలము లో టిబి గుర్తించాలంటే పట్టణాల కు వెళ్లి టిబి పరీక్ష చేసుకొని మందులు తీసుకొని రావాలి, కానీ ఇప్పుడు మన ఊరికి వచ్చి అట్టి పరీక్షలు ఇక్కడ చేసి, మందులు ఇంటికి వచ్చే ఇస్తున్నారు. మండల ప్రజలు అందరూ ఇలాంటి టిబి క్యాంప్ సద్వినేయోగము చేసుకోవలని స్థానిక సర్పంచ్ మరియు జెడ్పీటీసీ గారు కోరినారు.*
*ఇట్టి కార్యక్రమము లో వైద్య సిబ్బంది సత్యమ్మ, వెంకట సుబ్బమ్మ, స్వరూప రాణి, రాజశేఖర్, తిరుపతయ్య, టిబి సూపర్ వైజర్ రత్నయ్యా, శ్రీదేవి ఆశ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు విష్ణు,వెంకటేష్ తదిరలు పాల్గొన్నారు.*
2 Attachments