క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన…

చిలప్ చేడ్/23ఆగస్టు/జనంసాక్షి :- మండలంలోని అజ్జమర్రి గౌతపూర్ గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి గ్రామాలలోని పత్తి వరి పంటలను పరిశీలన చేసినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి పంటకు పేనుబంక ఉధృతి ఉందని దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 2ml లీటరు నీటిలో కలిపి పిచికరి చేయాలని తెలపడం జరిగింది అదేవిధంగా వరి పంటలో కాండంతోలుచు పురుగు నివారణకు క్లోరిపైరిపాస్ 2ml లీటరు నీటిలో కలిపి పిచకరి చేయాలని సూచించారు అదేవిధంగా రైతులకు పిఎం కిసాన్ లబ్ధిదారులు ఆగస్టు 31 లోపు ఈ కేవైసీ చేయించుకోవాలని లేదంటే వారికి పీఎం కిసాన్ డబ్బులు రావని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఈవో భూపాల్ రైతులు ఉన్నారు

తాజావార్తలు