ఖమ్మంలో పత్తిరైతుల ఆందోళన
ఖమ్మం : జిల్లాకేంద్రంలోని పత్తి మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్‌కు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ సీసీఐ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు రైతులను అడ్డుకోవడంతో మార్కెట్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.