*ఖాజీపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమికి రైతుబంధు*
అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం*
=============================
మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమికి అదే గ్రామానికి చెందిన ఆరు మంది రైతులు అక్రమంగా రైతుబంధు లబ్ధి పొందుతున్నారని గ్రామస్తులు స్థానిక ఎమ్మార్వో కు,జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆ గ్రామంలో ఆరు మంది రైతుల దగ్గర సర్వేనెంబర్ 62 లో 13 ఎకరాల 28 గుంటల భూమిని గ్రామ ప్రజల ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వం కొని ఇవ్వడం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అట్టి భూమిలో గ్రామ ప్రజలు సుమారుగా 200 ఇండ్లను నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఇచ్చిన భూమిలో నివాసముంటున్న అమాయక ప్రజల దగ్గర మీ ఇంటి పక్కన, ఇంటి ముందు ఇంకా మిగులు భూమి ఉంది అంటూ ఇంటి యజమానులను బెదిరిస్తున్నారని, వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ వారి దగ్గర ఆ పట్టాదారులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు మహిపాల్, చంద్రప్ప జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఇట్టి విషయంపై మండల అధికారులకు జిల్లా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు మహిపాల్ చంద్రప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన భూమికి అక్రమంగా రైతుబంధు లబ్ధి పొందుతున్న ఆ రైతులకు వెంటనే రైతుబంధు నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Attachments area