గడ్కరీ రాకతో చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి
– వైసీపీ ఎమ్మెల్యే రోజా
తిరుపతి, జులై11(జనం సాక్షి) : పోలవరం పనులు పరిశీలించేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారనగానే సీఎం చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం కట్టాల్సి ఉన్నా… టెండర్లు తనకిస్తే ప్రత్యేక ¬దా, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీలు అవసరం లేదంటూ రాష్ట్ర భవిషత్తునే తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుదేనని రోజా విమర్శించారు. బుధవారం చిత్తూరుజిల్లా వడమాలిపేట మండలం, ఎస్వీపురం పంచాయతీలో రోజా పర్యటించారు. ఈసందర్భంగా ట్రస్టుద్వారా రోజా ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా
ఫ్యాన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ కేంద్రమంత్రి వచ్చినా పట్టించుకోని చంద్రబాబు.. గడ్కరీ వస్తున్నారని తెలిసి మొన్న కేబినెట్ విూటింగ్ పెట్టి, మంత్రులు వెళ్లకూడదని చెప్పినా కూడా, నేడు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారంటే.. పోలవరం టెండర్లలో ఎంత అవకతవకలు జరిగాయన్నది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. జమిలి ఎన్నికలకు వైసీపీ మద్దతు ఇస్తే.. బీజేపీతో కుమ్మక్కయిందని విమర్శిస్తున్నారని, 2017లో రాష్ట్ర, కేంద్ర ఎన్నికలు ఒకేసారి జరిపించాలని, అలా అయితే సమయం, డబ్బు వృథాకాదని చంద్రబాబు మాట్లాడిన విషయాన్ని రోజా ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగాపోయియని, తెలుగుదేశం నేతలు కేవలం దోచుకొనేందుకే పదువల్లో కొనసాగుతున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.