గడ్డెన్న వాగు ప్రాజెక్టులో భారీగా వరద నీరు

భైంసా.రూరల్ జనం సాక్షి ఆగస్టు19:-స్థానికంగా,ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టులో శనివారం భారీగా వరద నీరు వచ్చి చేరింది.దీంతో ప్రాజెక్టు లోకి 3200 క్యూసెక్కుల వరద నీరు రాగా,ఒక గేటును తెరిచి 6,838 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.852 టి.ఎం.సిలు కాగా,ప్రస్తుతనీటిమట్టం 1.526 టి.ఎం.సి లుగా కొనసాగుతుంది.