గణనాధుని నవరాత్రి ఉత్సవాలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం

 

డోర్నకల్ సెప్టెంబర్-09
(జనంసాక్షి న్యూస్)

శ్రీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల భాగంగా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలోని శ్రీ శివఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాధునికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినాయకుని మండపం వద్ద మహాఅన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు దేవులపల్లి సోమయ్య అరుణ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న నున్న రమణ,గ్రామ సర్పంచ్ సిహెచ్ సమ్మిరెడ్డి మాజీ జెడ్పిటిసి గొర్ల సత్తిరెడ్డి, సొసైటీ చైర్మన్ సిహెచ్ బిక్షం రెడ్డి అన్నదాన కార్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నున్న రమణ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని ఆయన అన్నారు.ఆ విఘ్నేశ్వరుడిని ఆశీస్సులతో మండల ప్రజలందరూ ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.ఆలయ కమిటీ సభ్యులకు, అన్నదాన కార్యక్రమం నిర్వహించిన దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విగ్రహ దాతలు రేగళ్ల భీష్మ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, లడ్డు ధాత చేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పూజా సామాగ్రి దాతలు గుణగంటి చందు భువనేశ్వరి దంపతులు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మేకపోతుల శ్రీనివాస్ గౌడ్,ఉప సర్పంచ్ గొడుగు సురేష్,లింబ్యా తండా సర్పంచ్ బాధవత్ బాలాజీ, వార్డు కౌన్సిలర్ పోటు జనార్ధన్,గొర్ల సత్యనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ గంధంసిరి ఉపేందర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగభూషణం,సిహెచ్ మురళీధర్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ అంగోత్ లక్ష్మణ్,సొసైటీ డైరెక్టర్ నాగేశ్వరరావు, రాజివ్,అంజయ్య, వెంకటేశ్వర్లు, శ్రీశైలం,పూజరి వెంకటేశ్వర్లు,సురభి భాస్కర్,భూక్య భీముడు నాయక్,కొడవండ్ల యాదగిరి,వీరన్న, ఆలయ కమిటీ సభ్యులు రఘు,రాము,సంతోష్, సందీప్,నందు,విక్రమ్, సంతోష్,వివేక్,నవీన్, చరణ్,యాకయ్య,గ్రామ పెద్దలు,వివిధ అను బంధాసంఘాల నాయకులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.