గణేష్ నవ రాత్రోత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
 సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లాలో గణేష్ నవ రాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఉత్సవ కమిటీ, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ  రాజేంద్రప్రసాద్ , అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావుతో కలసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గణేష్ నవరాత్రులను ఉత్సవ కమిటీ, సంబంధిత అధికారులు సమన్వయంతో కలిసి ముందస్తుగా ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు.శాంతి సామరస్యాలకు
ప్రతీకగా ఉత్సవాలు జరగాలని, అన్ని చోట్లా కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలను సోదరభావంతో జరుపు
కోవాలన్నారు.మండపాల నిర్వాహకులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని, మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదన్నారు.ఉత్సవాలు భక్తిభావంతో జరుపుకోవాలన్నారు.జిల్లాలో ఏర్పాటు చేసే గణేష్ విగ్రహాల వివరాలను పోలీస్, రెవెన్యూ శాఖలకు పంపాలని తెలిపారు.  నిమజ్జనం రోజున మద్యం దుకాణాలు, బెల్టుషాపులు
మూసి వేస్తామన్నారు. గణేష్ మండపాలు రోడ్డు
మధ్యలో ఏర్పాటు చేయవద్దని, వాహనాలకు దారి
వదలాలని ప్రజలకు ఎక్కడకూడా అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.నిమజ్జనం జరిగే సమయంలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్
శాఖలసూచనలు
పాటించాలని, అలాగే నిమజ్జనం రోజున అన్ని పాయింట్లలో నీటి లోతు హెచ్చరికల బోర్డులు,గజ ఇతగాళ్లను, క్రెయిన్లను  అందుబాటులో ఉంచాలన్నారు.అలాగే జిల్లాలో మూసి పరివాహక ప్రాంతంలో ఎక్కువగా నిమజ్జనం జరుగుతున్నందున గట్టి బందోబస్తుతో పాటు నిరంతరం  విద్యుత్ ,ప్రమాద హెచ్చరిక బోర్డులు ఉంచాలని   సూచించారు.విగ్రహాల తరలింపు జరిగే రహదారుల్లో  పక్కా ప్రణాళికతో రోడ్ల మరమ్మత్తులు, చెట్ల కొమ్మలను తొలగింపు, నిరంతర విద్యుత్ అలాగే త్రాగునీరు తప్పక ఏర్పటు చేయాలని అధికారులను ఆదేశించారు.మండపాలలో   విద్యుత్ శాఖ అనుమతులతో సంబంధిత లైన్ మన్ లతో విద్యుత్ ను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.అనంతరం ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ఎక్కడకూడా ఇబ్బంది కలిగేలా మండపాలు ఏర్పాటు చేసుకోవద్దని,ఉత్సవ కమిటీ తప్పక పోలీసులకు సహకరించాలన్నారు.నిమజ్జనం కార్యక్రమాల్లో పోలీసులకు పూర్తగిగా సహకారం అందించాలని,ముందుగానే బందోబస్తు,విధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో జెడ్పి సిఈఓ సురేష్ , ఆర్డిఓలు రాజేంద్ర కుమార్, వెంకా రెడ్డి, డిపిఓ యాదయ్య, డీఎస్ఓ విజయలక్ష్మి,  డీఎస్పీ నాగభూషణం,  తహసీల్దార్  వెంకన్న ,  ఫైర్ , పోలీస్ అధికారులు,ఉత్సవ కమిటీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.