గతిలేక హైదరాబాద్‌కు వచ్చింది మీరు..

సీమాంధ్ర ప్రాంతం వారికి గతిలేక 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పేరుతో కుట్ర పూరితంగా హైదరాబాద్‌లో ప్రవేశించారు. ‘ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు’ ప్రత్యేకాంధ్ర రాష్ట్రానికి రాజధానిగా పెట్టుకున్న కర్నూల్‌లో కనీసం భవనాలు కూడా గతిలేక టెంట్ల కింద ఆఫీసులు పెట్టుకున్న వారు ఇక్కడికొచ్చి తామే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని భీరాలు పలుకుతున్నారు. వారు గుర్తుంచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సీమాంధ్ర ప్రాంతంతో కలపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడక పూర్వమే హైదరాబాద్‌ స్వతంత్ర భారతంలో ఒక రాష్ట్రం. ఆంధ్రోళ్లు బ్రిటిష్‌ పాలనలో ఉన్న సమయంలో హైదరాబాద్‌ స్వతంత్ర దేశం. హైదరాబాద్‌ అప్పటికే ప్రపంచ స్థాయి నగరం. దేశవిదేశాల నుంచి వచ్చే అతిథులు ఇక్కడి నిజాం రాజుల ఆతిథ్యాన్ని చూసి ఔరా అనుకోని సందర్భం లేదు. ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి, హైకోర్టు సహా పరిపాలన పరమైన అన్ని భవనాలు నిజాం కాలంలో నిర్మించినవే. ఈ సత్యాలను మరుగున పరిచి సీమాంధ్ర ప్రాంత నేతలు, పెట్టుబడిదారులు తామే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్లొక్కరే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. తమ వ్యాపారాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుపుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. వాళ్లలాగే సీమాంధ్ర ప్రాంతం నుంచి ఇప్పటి పెట్టుబడిదారులు అప్పుడు పొట్ట చేతపట్టుకొని వచ్చిన వారే. పాలకులు తమవారు కావడంతో వారికి తాబేదారులుగా మారి హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్తులను కొళ్లగొట్టి తెగబలిశారు. తెలంగాణ నిధులు, నీళ్లు, వనరులను వశం చేసుకొని కోట్లకు పడగలెత్తారు. దేశవిదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకొని కార్పొరేట్‌ శక్తులుగా మారారు. తొండ ముదిరి ఊసరవెళ్లిగా మారినట్టు ఒకప్పుడు పొట్ట చేతబట్టుకొని హైదరాబాద్‌కు వలసొచ్చిన వారు ఇప్పుడు హైదరాబాదే మాది అనే స్థాయికి ఎదిగారు. వాస్తలను మరుగుపరిచి, చరిత్రను వక్రీకరించి అబద్ధాల పునాదులపై సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్మింపజూస్తున్నారు. వారు విస్మరిస్తున్న విషయం మరొకటి ఉంది. రాష్ట్రాల ఏర్పాటులో కేంద్రం నిర్ణయమై ఫైనల్‌. ఏ రాష్ట్రం నుంచి కొంత భాగాన్ని విడదీసి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయదలిచారో ఆ పాత రాష్ట్రంలోని వారికి ఇష్టం లేకున్నా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఆర్టికల్‌ 3 ప్రకారం కేంద్రం పార్లమెంట్‌లో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టి, సభ ఆమోదం పొందితే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చు. కానీ సీమాంధ్రులు తెలంగాణ ఏర్పాటుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం కావాలనే కొత్త పల్లవి అందుకున్నారు. 2009 డిసెంబర్‌ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఈమేరకు రాష్ట్ర శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. అందుకు ఓ ప్రాతిపదిక ఉంది. డిసెంబర్‌ 7న అసెంబ్లీలో తెలంగాణపై జరిగిన చర్చలో మొత్తం శాసనసభ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడింది. కాబట్టి శాసనసభలో తీర్మానం సులభంగా గెలుస్తుందనే భావనతోనే చిదంబరం రాష్ట్ర శాసనసభలో తీర్మానం అన్నాడే తప్ప తీర్మానం తప్పనిసరి కాదు. కానీ రాజమండ్రి వేదికగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సహా వేదికపై ఉన్న వారంతా శాసనసభలో తీర్మానం వీగిపోతుంది కాబట్టి తెలంగాణ ఏర్పడే అవకాశమే లేదన్నట్టుగా మాట్లాడారు. వారిది రాజకీయ అజ్ఞానమనుకోవాలా? వారు ప్రమాణ స్వీకారం చేసిన రాజ్యాంగం మీద గౌరవం లేదనుకోవాలా? లేక ప్రశాంతంగా ఉన్న సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో భావోద్వేగాలు రగల్చడమే ఎజెండా అనుకోవాలా? అన్నది అక్కడి ప్రజలకే అంతుచిక్కని ప్రశ్న. 2009 డిసెంబర్‌ 10 రాజీనామాల అస్త్రంతో తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న సీమాంధ్ర ప్రాంత నేతలు మళ్లీ రాజకీయా డ్రామాలు ఆడి తెలంగాణను అడ్డుకోజూస్తున్నారు. ఇది ఎంతో కాలం కొనసాగబోదు. తెలంగాణ నుంచి ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు సంఘటితంగా అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తే తెలంగాణ ఏర్పాటు ఎంతో కాలం ఆగదు. సీమాంధ్ర నేతలు హైదరాబాద్‌పై ఇంకా ఆశలు పెంచుకొని అవాకులు చెవాకులు పేలితే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోబోరు.  తరత