గతి తప్పిన పట్టణ ప్రగతి
పినపాక నియోజకవర్గం జూన్ 15( జనం సాక్షి):
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆన్నారం,శివలింగాపురం,రాంనగర్, ఆదర్శనగర్ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దూర్గ్యల సుధాకర్ ,మాజీ ఎంపీటీసీ సొంధే కుటుంబరావులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణుగూరు మున్సిపాలిటీ లో నెలలకొద్ది వెలగని వీధి లైట్లు అంతర్గత రోడ్లు పట్టింపే లేదు. సైడ్ డ్రైనేజీ పనులు ప్రారంభించి సంవత్సరం అయినా నేటికీ పూర్తికా లేదు. ప్రజాధనం వృధా చేయడమే కాక ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడుతున్నారు. కాలవలో చెత్త మురికినిరు నిండి దోమలు స్వైర విహారం చేస్తున్నా పట్టించికోని మున్సిపల్ అధికారులు ఐదో విడత పట్టణ ప్రగతి లో ప్రగతి గతి తప్పింది ఎక్కడ ఉన్న చెట్లు అక్కడే చెత్తాచెదారం తొలగించకుండా కాలయాపన చేస్తున్నారు. కొన్ని చోట్ల పిచ్చి మొక్కలు పెరిగి పాములు తిరుగు తున్నాయని వచ్చే వర్షాకాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఏ మాత్రం పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపాలిటీ లో ఎలెక్ట్రిషన్ ఉన్నపటికీ వారు చూడకుండా ,ఔట్ సోర్సింగ్ లో పనిచేసేవారే చూడాలని చెబుతున్నారు. ఈ విషయం అవుట్సోర్సింగ్ వాళ్ళని అడిగితే మాకు ఇప్పటి వరకు జీతాలు కూడా ఇవ్వలేదని అందుకే పనికి రావడంలేదని సమాధానం చెప్పారు. రెండు నెలలుకావస్తున్న లైట్లు చూడటంలేదని మున్సిపాలిటీల్లో ఏలక్ట్రిషన్ ఉన్న పట్టించుకోవడంలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు గత సంవత్సరం4-8-2021 న పట్టణ ప్రగతి లో భాగంగా ప్రధాన రహదారిపై సైడ్ డ్రైనేజీ ల కొరకు ప్రభుత్వం 33 లక్షలతోనిర్మాణాలు చేపట్టారు.కానీ పనులు అసంపూర్తిగా చేసి కాంట్రాక్ట్ చేతులు దులుపుకొన్నారు.సీతారామ థియేటర్ నుంచి సీపీఐ ఆఫీస్ మీదుగా పెట్రోల్ బంక్ వరకు కాలువ 4 అంగుళాలు ఏత్తు ఉండటం తో కాలువలో మురికి నీరు ఆగి, దుర్వాసనతో,దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ విషయం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన ,పట్టించుకోవటo లేదన్నారు.ఈ సారైనా పట్టణ ప్రగతిలో మరమ్మతులు నీరు ఆగకుండా చేస్తారని అడిగిన అధికారులు పట్టించుకోవడం లేదు రాయిగూడెం లో మంచినీరు అందరికి ఇవ్వాలని,ముందు లైన్ వేసిన వారికి నేటికి మంచినీరు ఇవ్వటం లేదని వారు ఆరోపించారు.ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కరించకుంటే సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు దశ్రరధం,వీరమ్మ, రాములు,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.