గత పాలకుల కారణంగానే జిల్లా నిర్లక్ష్యం

నల్లగొండ,జూలై24(జ‌నంసాక్షి): సమైక్య రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే నల్లగొండ ప్రాంతానికి శాపంగా మారిందని జడ్పీ చైర్మన్‌ నేనావత్‌ బాలూనాయక్‌ అన్నారు. ప్రకృతి సహకరించినా.. కాంగ్రెస్‌ పాలకుల నిర్లక్ష్యం వల్లే కరువు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. డిండి ప్రాజెక్టు నీటిని విడుదల చేయడం ద్వారా రైతుల్లో భరోసా కల్పించామని అన్నారు. టీఆర్స్‌ ప్రభుత్వం దేవరకొండ అభివృద్ధికి 4వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధికి ఈ ప్రాంతమే నిదర్శనమని, దీనిపై చర్చించేందుకు సిద్ధమని కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్‌, జానారెడ్డి, కోమటిరెడ్డికి మంత్రి సవాల్‌ విసిరారు. జిల్లా నుంచి పేరున్న నాయకులుఉన్నా ఏ ఒక్కరోజు కూడా జిల్లా గురించి పటించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఈ విషయంపై ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. సొంతడబ్బా కొట్టుకునే నాయకులు ఒక్కసారి గుండెవిూద చేయి వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. వేసవి నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి డిండి రిజర్వాయర్‌ను నింపినట్లు చెప్పారు. నిజాంకాలంనాటి కాలువల్లో పూడిక తీసి చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లోని చెరువులు నింపి మంచినీటి సమస్యను తీర్చినట్లు తెలిపారు.

తాజావార్తలు