గనుల శాఖలో పలువురికి బదిలీలు
విజయనగరం, జూలై 13 : భూగర్భ గనుల శాఖలో పలువురు ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ శాఖలో జరిగిన బదిలీలలో భాగంగా స్థానిక అసిస్టెంట్ జియాలిజిస్ట్ ఆర్. తమ్మినాయుడుకు శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయింది. రాయల్టీ ఇన్‌స్పెక్టర్ హరకుమార్ నాయుడుకు విశాఖ రీజినల్ మొబైల్స్ స్క్వేడ్‌కు బదిలీ అయింది. తమ్మినాయుడు స్థానంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో పని చేస్తున్న విజయలక్ష్మిని ఇక్కడ అసిస్టెంట్ జియాలిజిస్టుగా నియమించారు. హరకుమార్ నాయుడు స్థానంలో కె. పురుషోత్తమ నాయుడుని ఇక్కడి రాయల్టీ ఇన్‌స్పెక్టర్ నియమించారు.