గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం
.చంటి పిల్లలకు అక్షరాభ్యాసం
సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి చేరాలి
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 15
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని గ్రామ సర్పంచ్ వెంగళ సరోజన అన్నారు. గురువారం మండలంలోని మెట్ పల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సరోజన ముఖ్య అతిథి హాజరై గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చంటి పిల్లలకు అక్షరాభ్యాసం, అన్న ప్రసన్న , ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజశ్రీ మహిళలకు పోషకాహారం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విశాలాక్ష్మి, విజయ, సునీత, లీలాదేవి, ఏఎన్ఎం పద్మ, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు