గర్భిణీ స్త్రీల జాగ్రత్తలు,సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం

 

అచ్చంపేట,19 జులై, జనం సాక్షి న్యూస్ :- స్థానిక పట్టణంలోని వినాయక నగర్ కాలనీ లో జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు వైద్య సేవల బృందం ప్రజలకు పలు రకాల సూచనలు చేస్తూ, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు పన్నెండు వారాల లోపు సమీప ఆరోగ్య కార్యకర్త వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ,రక్త పరీక్షలు స్కానింగ్ లు, గైనకాలజిస్ట్ వద్ద చెక్ అప్ చేసుకోవాలని, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలని,ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానంతరం ప్రభుత్వం ఇచ్చే కేసీఆర్ కిట్ ఆర్థిక సహాయం.వంటి పలు అంశాలను వివరించారు .ఇదే క్రమంలో ప్రజలకు మందులు పంపిణీ అనంతరం, అపరిశుభ్రంగా నిలువ ఉంచిన నీటి లో దోమ లార్వాలు వృద్ధి చెందుతుంది కావున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ,శుద్ధి చేసిన నీటిని ఆహారపదార్థాల మాత్రమే తీసుకోవాలనిసూచించారు.కార్యక్రమంలో వైద్యాధికారి శాంతిశ్రీ, డివిజన్ ఉప మలేరియా అధికారి అశోక్ ప్రసాద్,పర్యవేక్షకుడు హనుమంతు, వైద్య సిబ్బంది నారాయణమ్మ,నిర్మలా బాయి,రజిత, అంగన్వాడీ టీచర్ భారతి, వార్డు కౌన్సిలర్ అప్ప శివ పాల్గొన్నారు.