*గాంధీనగర్ లో కుక్కల స్వైర విహారం*
కోదాడ అక్టోబర్ 11(జనం సాక్షి) కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గాంధీనగర్లో
గుంపులు గుంపులుగా వీధుల్లో కుక్కలు, విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. ప్రతిక్షణం ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. పిల్లలు,వృద్ధులు మున్సిపల్ అధికారులకు కుక్కలను పట్టించాలీ కోరారు. కోదాడ పట్టణ పరిధిలోని గాంధీనగర్ లో కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతుంది అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలూ వీదుల్లో కుక్కలు గుంపులుగుంపులుగా తిరుగుతూ వీధుల గుండా వెళ్లే వారిపై దాడి చేస్తున్నాయి,ఎగబడి కరుస్తున్నాయనీ చెబుతున్నారు. ఇప్పటివరకు అనేకమంది కుక్కకాటుకు గురయ్యారని స్థానికులు తెలుపుతున్నారు. గతంలో ఈ విషయం మున్సిపల్ అధికారులకు తెలిపినా పట్టించుకోవడంలేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను బంధించి అటవీ ప్రాంతాలకు తరలించాలని వారు కోరుతున్నారు.
Attachments area