గాంధీ ఆసుపత్రికి బయలుదేరిన అక్బరుద్దీన్
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి బయలుదేరారు. ఈ ఉదయం ఆయన నివాసానికి వచ్చిన నిర్మల్ పోలీసులు విచారణకు సహకరించాల్సిందిగా కోరారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి రావాల్సిందిగా నోటీసులు అందజేశారు. అక్బరుద్దీన్ రానున్న నేపథ్యంలో ఆసుపత్రి పరిసరాల్లో భారీ బందోబస్తు చేపట్టారు.