గాయం నుంచి కొలుకున్న అగార్కర్‌ పంజాబ్‌తో మ్యాచ్‌కు జట్టు పగ్గాలు

ముంబై ,డిస్శెబ్‌, 6 (టన్శసలక్ఞ్ష) రంజీ సీజన్‌లో పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌ కోసం ముంబై జట్టును ప్రకటించారు. గాయం నుండి కోలుకున్న అజిత్‌ అగార్కర్‌ జట్టులోకి తిరిగి వచ్చాడు. పంజాబ్‌పై ముంబై సారథ్య బాధ్యతలు అగార్కరే చేపట్టనున్నాడు. సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో రైల్వేస్‌పై గాయపడిన ఈ ముంబై ఫాస్ట్‌ బౌలర్‌ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌లకూ దూరమయ్యాడు. ప్రస్తుతం అగార్కర్‌ రాకతో బలంగా మారిన ముంబైకి మరో అడ్వాంటేజ్‌ కూడా లభించింది. వచ్చే మ్యాచ్‌కు బ్యాట్స్‌మన్‌ అజంక్యా రహానే కూడా అందుబాటులో ఉండనున్నాడు. గత మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ముంబై జట్టు బెంగాల్‌ పై తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కారణంగా పాయింట్లు సాధించింది.

ముంబై రంజీ జట్టు ః

అజిత్‌ అగార్కర్‌ (కెప్టెన్‌) , అజంక్యా రహానే , వసీం జాఫర్‌ , రోహిత్‌శర్మ , కౌస్తుబ్‌ పవార్‌ , హికెన్‌ షా , అభిషేక్‌ నాయర్‌ , సూర్యకుమార్‌ యాదవ్‌ , ఆదిత్య తారే , రమేశ్‌ పొవార్‌ , అంకిత్‌ చవాన్‌ , ఇక్బాల్‌ అబ్ధుల్లా , ధావల్‌ కులకర్ణి , బల్విందర్‌సింగ్‌ సంధు , శర్జుల్‌ థాకూర్‌