గిరిజనులు వారి హక్కుల కోసం ఉద్యమించాలి
టేకులపల్లి, సెప్టెంబర్ 2( జనం సాక్షి): గిరిజనులు వారి హక్కుల కోసం ఉద్యమించాలని సిపిఐ జిల్లా నాయకులు గుగులోతు రామచందర్ అన్నారు. తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర రెండవ మహాసభలు, ఏఐటీయూసీ ఆఫీస్ హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్ లో జరిగింది ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలానికి చెందిన గుగ్గు లోత్ రామ్ చందర్ గిరిజన సమైక్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు.ఇల్లందు మండలానికి చెందిన గుగులోత్ కృష్ణకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా నాయకులు రామచందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్న గిరిజనుల హక్కులను పరీక్షించుకోవడానికి గిరిజనులు అంతా ఐక్యంగా ఉద్యమించాలని, ఉపాధి ,ఉద్యోగ ,విద్య రంగాలలో అధివాసి గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, స్వసంత్రం సిద్ధించి 75 ఏళ్ల గడుస్తున్న పేదలకు కూడు ,గూడు లతోపాటు ఉపాధి, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడంలో పాలకవర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని, పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాబోయే రోజులలో మరింత పోరాటాలు చేస్తామని తెలిపారు.