గిరిజన విద్యార్థి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ స్టడీ మెటీరియల్ అందజేత

పినపాక నియోజకవర్గం జూలై 26 (జనం సాక్షి); సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ప్రకాశం ఖని ఓ సి 4 లో ఆపరేటర్ గా పని చేస్తున్న నంబూరి శ్రీనివాస్ (ఏఐటీయూసీ నాయకులు) గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ స్టడీ మెటీరియల్ వితరణగా అందజేశారు. మంగళవారం కొత్త కొండాపురం సింగరేణి సామాజిక భవనంలో జరిగిన కార్యక్రమంలో నంబూరు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు తన భార్య అనురాధ పంచమ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి పునరావాస కొత్త కొండాపురం సింగరేణి సేవా సమితి ఉచిత ట్యూషన్ సెంటర్లోని 38 మంది గిరిజన విద్యార్థిని విద్యార్థులకు 12 వేల రూపాయల విలువ గల స్కూల్ బ్యాగులు నోట్ పుస్తకాలు వితరణగా అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. గిరిజన విద్యార్థి విద్యార్థులకు జీవితంలో ఎదగడానికి ఎన్నో చక్కని అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు,చదువుకు పేదరికం అడ్డు కాకూడదని తను భావిస్తానని తను శక్తి మేరకు తన భార్య అనురాధ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నిరుపేద గిరిజన, గిరిజనేతర విద్యార్థిని విద్యార్థుల చదువుకు ప్రోత్సహిస్తూ సింగరేణి సేవా సమితి స్ఫూర్తితో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గతంలో రేగుల గండి ప్రాథమిక పాఠశాల, అశ్వాపురం ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమం, బాల వెలుగు లాంటి చోట్ల చక్కని సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలకు తమ కుమార్తెలు తేజశ్రీ ఉషశ్రీ లు కూడా ఎంతగానో సహకరిస్తారని సమయం దొరికితే పాల్గొంటారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు, అనంతరం తన స్నేహితులతో కలిసి చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేశారు, కార్యక్రమంలో భాగంగా విద్యార్థి బంగారు తనయ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు., సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పాషా కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించగా సింగరేణి కార్మికులు సిహెచ్ వెంకటేశ్వరరావు (అబ్బులు), సత్యనారాయణ, ఉపాధ్యాయులు బంగారి శ్రీకాంత్, సంధ్య, గ్రామస్తులు బంగారి రవి, కాటిబోయిన మల్లమ్మ, సారమ్మ, కొమరం కమలమ్మ, లాలమ్మ,నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు.