*గుట్కా ,గంజాయి పై అవగాహన కార్యక్రమం*

, జులై 15 (జనం సాక్షి):* మండల కేంద్రంలోని ధర్మగడ్డ తండా గ్రామంలో  మాదక ద్రవ్యాల పై,గుట్కా,గంజాయి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఎస్సై ఎమ్ రమేష్ నాయక్ ఆదేశాల మేరకు  గ్రామంలో గంజాయి,గుట్కా మరియు మాదక ద్రవ్యాల వల్ల కలిగె నష్టం గురించి గ్రామంలోని ప్రధాన చౌరస్తా లో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసు మరియు కానిస్టేబుల్ రామకృష్ణ అవగహన కల్పించారు .  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న యువత గంజాయికి బానిసలై జీవితాలు బలి చేసుకోకుండా తల్లి తండ్రులు వారి బాద్యతను సక్రమంగా నిర్వహించాలి లేదంటే ఎదిగే మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. గ్రామంలో ఎవరైతే గంజాయి, గుట్కా అమ్మకం చేస్తున్నారో వాళ్ళకి ఇదే చివరి హెచ్చరికలా  భావించి తక్షణమే అమ్మకాలు నిలిపివేయాలని ఈ సందర్బంగా వారు హెచ్చరించారు. ఇంకా యువత యుక్త వయస్సుకు రాగానే ప్రేమ అని చేడు తిరుగుళ్ళు తిరగకుండ జాగ్రత్తలు చెప్పాలిని అన్నారు.వాహన లైసెన్స్ లేకుండానే యువత వాహనాలను నడపటం నేరం ఆలా చేస్తే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  వాహనాలను మద్యం సేవించి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్ల యాదగిరి, గూగులోతు ఆంజనేయులు, బానోతు సైదులు ,ఎర్రబెల్లి నర్సయ్య, మూడ మహేందర్, పంగ రాములు, సైదులు, శివుల మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.