గురుకులాలలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలి : బీఎస్పీ

మోత్కూరు జూలై  జనంసాక్షి : బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మోత్కూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర వసతిగృహమును సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నము, కూరలు పరిశీలించగా అన్నము పలుకు, పలుకులుగ ఉండి నాణ్యతమైన ఆహారం లేక నాణ్యతలేని ఆహారం పెరిగే పిల్లలకు ఇవ్వడం ఏమి అని ప్రశ్నించగా అందులో పని చేసే సిబ్బంది బియ్యం బాగాలేవని జాయింట్ కలెక్టర్ కి విన్నవించిన వారు వచ్చిన బియ్యం తో వండి పెట్టమని ఆదేశించారని తెలిపారు. బాలుర కు యూనిఫాం ఇంతవరకు రాలేదని ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఎంపీసీకి రూములు లేక అలర్ట్ చేయలేదని పాఠశాల సిబ్బంది పాఠశాల ప్రిన్సిపాల్ అందుబాటులో లేనందున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదేవిధంగా బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ లలో పనిచేసే పార్ట్ టైం ఉద్యోగస్తులకు జీతం పెంచారని ఎస్సీ వెల్ఫేర్ లో పనిచేసే పార్ట్ టైం ఉద్యోగస్తులకు జీతం పెంచలేదని బహుజన్ సమాజ్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు కె బి రాజు ఆరోపించారు. వెంటనే ప్రభుత్వ స్పందించి పెరిగిన రేట్లు కనుగుణంగా మేస్ చార్జీలు పెంచాలని పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ఉద్యోగస్తులకు పార్ట్ టైం పని చేసే వారికి మిగతా సొసైటీ వారికి ఏ విధంగానైతే జీతాలు పెంచారో ఆ విధంగా పెంచాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ మండల అధ్యక్షులు ఎర్రవెల్లి నాగేశ్వర్, మండల నాయకులు ముక్కెర్ల కిరణ్ కిరణ్, తొంట సురేష్, ఎల్లంకి స్వామి తదితరులు పాల్గొన్నారు.