గురుగ్రంథ్ సాహిబ్ ప్రతులతో వచ్చిన బాధితులు
ఢల్లీిలో స్వీకరించిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి
న్యూఢల్లీి,ఆగస్ట్24(జనం సాక్షి): అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్‌లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి తీసుకువచ్చే పక్రియ కొనసాగుతోంది. దీనికితోడు అక్కడి బాధితులు బతుకు జీవుడా అంటే బయటపడుతున్నారు. మంగళవారం ఉదయం ఎయిర్ ఇంఢయాి విమానంలో కాబుల్ నుంచి 78 మంది ప్రయాణీకులు ఢల్లీికి చేరుకున్నారు. వీరిలో 25 మంది భారతీయులు ఉన్నారు. వీరితో పాటు అఫ్ఘాన్ సిక్కు, హిందూ కుటుంబాలకు చెందినవారు కూడా ఉన్నారు. సిక్కు సమాజానికి చెందిన కొంతమంది కాబుల్‌లోని గురుద్వారా నుంచి గురు గ్రంథ సాహిబ్‌కు చెందిన మూడు ప్రతులను తమ తలలపై పెట్టుకుని, ఇక్కడికి తీసుకు వచ్చారు. వీటిని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌పురి తదితరులు స్వీకరించారు. అక్కడ వీటికి రక్షణ లేదని గుర్తించి వాటితో పాటు వచ్చారు.