*గురుస్పందన పురస్కారం 2022 అవార్డ్ అందుకున్న మాసు రమేష్.
చిట్యాల 17( జనంసాక్షి )మండల కేంద్రం కి చెందిన మాసు రమేష్ కు హైదరాబాద్ లో గచ్చిబౌలి లో నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్పందన ఇంటర్ నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా గురు స్పందన పురస్కారం 2022ని అందుకున్నాడు.ఈమేరకు ఆదివారం హైదరాబాద్ లో గచ్చి బౌలిలోని బ్రహ్మ కుమారిస్ శాంతి సరోవర్ హల్ లో గురువుల విశిష్టత పైన స్పందన ఇదా ఇంటర్ నేషనల్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ట్రెండ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించగా కవిత ,రచనలో ఉత్తమ ప్రతిభ మాసు రమేష్ కనబరచడంతో గురు స్పందన పురస్కారం 2022 ని ముఖ్య అతిధులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ్ సై సౌందర్య రాజన్ ,ప్రముఖ తెలుగు సినిమా నటుడు మాజీ ఎంపీ మురళి మోహన్, తెలంగాణ రాష్ట్ర బిసి వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం స్పందన ఇదా ఫౌండేషన్ చైర్మన్ ఇదా శామ్యూల్ రెడ్డి,ఉస్మానియా యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం ,బెంగళూరు ఎస్ హెచ్ కె చైర్మన్ డాక్టర్ కులకర్ణి చేతుల మీదుగా గురు స్పందన పురస్కారం 2022 ని అందుకున్నారు.ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధులుగా జాతీయ పొగాకు తయారీ బోర్డ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ , మాజీ సీబీఐ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ, ఐపీఎస్,బ్రహ్మ కుమారిస్ డైరెక్టర్ రాజయోగిని బికే కులదీప్ దీదీ,,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల సెక్రెటరీ సంజీవ్ రావు,ఆకెళ్లరాఘవేంద్రరావు ,ఎయిమ్స్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జిలేకే దుర్గ,ప్రొఫెసర్ విశ్వనాధం ,ప్రముఖ మానసిక వైద్య నిపుణులు రామకృష్ణ,సుధీర్ సాండ్ర లు పాల్గొన్నారు..ఈ సందర్భంగా స్పందన ఇదా ఇంటర్ నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ శ్యాముల్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఉన్నత మైన విద్యను విద్యార్థులకు అందించి ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేయాలని కోరారు.విద్యార్థుల భవితవ్యం అంత కూడా ఉపాధ్యాయుల మీదనే ఆధారపడి ఉంటుంది అని అన్నారు.ఉపాద్యాయులలో ఉన్న ప్రతిభ ను వెలికితీసి వారి ప్రతిభకు అనుగుణంగా 2022 సంవత్సరం గాను ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కవిత రచనలో యువ కవిగా రాణిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను సువిధ్య డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న చిట్యాల మండల కేంద్రంకి మాసు రమేష్ కి గురు స్పందన 2022 అవార్డును బహుకరించినట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఇంత గొప్ప పురస్కారం రావడము సంతోషంగా ఉంది మా నాన్న స్ఫూర్తి తో వారి ఆశయాలను కొనసాగిస్తానని, సువిద్య డిగ్రీ కళాశాల యొక్క పేరు ప్రఖ్యాతులను కాపాడుతుంది అని అన్నారు.అదే విధంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా చిట్యాల గ్రామ దివంగత సర్పంచ్ నాన్న ఆయినటువంటి డాక్టర్ మాసు రాజయ్య గారు ఉత్తమ అధ్యాపక అవార్డ్ ని కళాశాలకు తీసుకురావడం జరిగింది అని, వారి ఆశీస్సులు ఆశీర్వదాలతోనే 2022 సంవత్సరం గాను నాకు గురు స్పందన పురస్కారం రావడం ఈ అవార్డును నాకు గురువు అయిన నాన్న డాక్టర్ మాసు రాజయ్య కి అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవార్డ్ అందచేసిన స్పందన ఇదా ఇంటర్ నేషనల్ ఫౌండేషన్ నిర్వహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.