గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది : సిఎం

రైల్వే నిర్లక్ష్యం వల్లే : చిరంజీవి
నెల్లూరు, జూలై 30 : మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని రైల్వే శాఖామంత్రికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. సోమవారం మధ్యాహ్నం నెల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మంటలకు దగ్ధమైన ఎస్‌11 బోగిని పరిశీలించారు. ప్రమాద వివరాలను, రైల్వే అధికారులను, జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, ఎస్‌పి రమణకుమార్‌లతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైల్వే రక్షణచర్యలపై పున:పరిశీలన జరగాల్సివుందన్నారు. మృతుల్లో రాష్ట్రానికి సంబంధించిన వారు ఎంత ఉన్నారో తెలియాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నలుగురిని గుర్తించినట్లు అధికారులు చెప్పారన్నారు. విచారణ పూర్తయ్యాకే ప్రమాదానికి గల కారణాలు వెల్లడి అవుతాయన్నారు. రైళ్ళల్లో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టాలని రైల్వే మంత్రికి లేఖ రాస్తాన్నారు. రాష్ట్రప్రభుత్వ అధికారులు జరిగిన సంఘటనపై వెంటనే స్పందిచడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పారు. ఇదిలా వుండగా ముఖ్యమంత్రితో పాటు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు.
రైల్వే నిర్లక్ష్యమే.. చిరంజీవి జరిగిన ప్రమాదం దురదృష్టకరమని రాజ్యసభ సభ్యులు చిరంజీవి అన్నారు. సోమవారం మధ్యాహ్నం నెల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మంటలకు దగ్ధమైన ఎస్‌11 బోగిని పరిశీలించారు. ప్రమాద వివరాలను, రైల్వే అధికారులను, జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, ఎస్‌పి రమణకుమార్‌లతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉన్నతస్థాయి అధికారులతో జరిగిన ఘటనపై దర్యాప్తు జరిపించాలన్నారు. రైళ్ళల్లో స్మోక్‌ డిటేక్టర్‌లను వాడితే ప్రమాదం ఈ స్థాయిలో జరిగివుండేది కాదన్నారు. సిబిఐ చేత దర్యాప్తు చేయించాలి జరిగిన దుర్ఘటనపై సిబిఐ చేత విచారణ జరిపించాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోరనున్నట్లు ఎంపి చింతామోహన్‌ తెలిపారు. యువకులు ఎక్కువ సంఖ్యలో చనిపోవడం దురదృష్టకరమన్నారు. ఒక్క బోగిలోనే ఈ స్థాయి ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
ఎలక్ట్రీషియన్‌ను నియమించాలి రెండు బోగీలకో ఒక ఎలక్ట్రీషియన్‌ను నియమించాలని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి అన్నారు. జరిగిన సంఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. మృతుల కుటుంబాలకు పదిలక్షల రూపాయలు, ఆ కుటుంబంలోని ఒకరికి రైల్వే ఉద్యోగం ఇవ్వాలని తమ పార్టీ కోరుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.