గుర్తు తెలియని వాహనం ఢీ: ఇద్దరు మృతి

కరీంనగర్‌: కరీంనగర్‌-ధర్మారం రహదారిపై పత్తిపాక వద్ద ఇవాళ రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.