గొప్ప దార్శనికుడు పండిట్ దీన్ దయాళ్ కు నివాళులు అర్పించిన : నాగోల్ కార్పొరేటర్ శ్రీమతి చింతల అరుణ సురేందర్
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ఏకాత్మ మానవవాదం ప్రతిపాదించి.. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే ప్రభుత్వ పథకాల మొదటి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ భావనను రూపొందించి.. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి పటిష్ట పునాదులు వేసిన గొప్ప దార్శనికుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, చెట్లు నాటిన నాగోల్ కార్పొరేటర్ శ్రీమతి చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డప్పు రాజు, రావుల శ్రీనివాస్, పద్మారెడ్డి, సరస్వతి, ప్రభాకర్ గౌడ్, రాఘవ చారి, రామ్, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.