గొర్రెలకు ఉచిత నీలి నాలుక టీకాలు

ఖానాపురం జులై 18(జనం సాక్షి): మండలంలోని  ధర్మ రావు పేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు వ్యాధులు రాకుండా ఉచిత నీలి నాలుక టీకాల కార్యక్రమం వెటర్నరీ వైద్య అధికారిని శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్లూ టంగే నీలి నాలుక టీకాలు గొర్రెలకు వేయడంతో వర్షాకాలంలో గొర్రెలకు  నీలి నాలుక (సొల్లు రోగం ) రాకుండా కాపాడుతుంది అన్నారు  . ఈ కార్యక్రమంలో   సిబ్బంది మానస , నాగేందర్ ,, గోపాలమిత్ర లక్ష్మినారాయదితరులు పాల్గొన్నారు.

                     .