గొర్రెలకు బదులుగా నగదు బదిలీ చేయాలి
వైస్ ఎంపీపీ దొంగలి నరసయ్య యాదవ్
– జిల్లా అధికారి ఏడి మల్లయ్య కి వినతి పత్రం అందజేత
కురవి ఆగస్టు:29
(జనం సాక్షి న్యూస్)
గొర్రెలకు బదులుగా నగదు బదులు చేయాలని కురవి మండల వైస్ ఎంపీపీ దొంగలి నరసయ్య యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.సోమవారం కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామ రైతు వేదికలో సొసైటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా ఎడి మల్లయ్య కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైస్ ఎంపీపీ దొంగలి నరసయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేసిన మొదటి విడత గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగాయని అన్నారు. మొదటి విడతలో ముసలివి, చిన్నపిల్లలను, నాసిరికం గొర్రెలను లబ్ధిదారులకు అంటగట్టారని వాటి విలువ సుమారు 60 నుండి 70 వేల వరకు మాత్రమే ఉంటుందని, మిగతా డబ్బులు అన్ని దళారులు, బ్రోకర్లు,ఏజెంట్లు, పశువైద్యాధికారులు కొట్టేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రెండో విడత గొర్రెల పంపిణీలో ఇప్పటికే దొంగలు పడ్డారని,ఆంధ్రకు గొర్రెల కోసం వెళ్లిన గొల్ల కురుమలకు అడ్డగోలుగా గొర్రెలను లబ్ధిదారులకు సాగడానికి పనికిరానివి అంటగడుతున్నారని కట్టిన డిడి డబ్బులు ఫోను ఏమి మిగలట్లేవని గొల్ల కురుమల ఆందోళన చెందుతున్నారని ఆయన జిల్లా ఏడి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా గొర్రెల పంపిణీలో అవినీతి జరగకుండా నిజమైన గొల్ల కురుమలకు లబ్ధి జరగాలనుకుంటే ప్రభుత్వం గొర్రెలకు బదులుగా నగదు బదులు చేయాలని, మీరు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వారిని కోరడం జరిగింది.అనంతరం జిల్లా ఏడి మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం గొల్ల కురుమల అభివృద్ధి కోసం ఈ పథకం ప్రవేశపెట్టిందని,కింది స్థాయిలో ఇంత అవినీతి జరుగుతూ ఉందని మాకు తెలియదు కావున ఇట్టి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి గొల్ల కురుమలకు న్యాయం చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్స్ బాదావత్ రామచంద్ నాయక్,అశోక్,వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు పర్శబోయిన మహేష్, నాగనబోయిన మహేందర్, దూదిమట్ల లింగన్న, కొల్లూరీ లింగన్న,ఎస్ మైసూర్,ఎడ్ల వెంకన్న,కే రాములు,కే వెంకన్న,కే లింగయ్య,సిహెచ్ కృష్ణ,సిహెచ్ లింగయ్య, టి.ముత్తయ్య,జక్క లింగన్న తదితరులు పాల్గొన్నారు.