గోదావరి పుష్కరాలు తెలంగాణలో కుంభమేళా తరహాలో.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

C

హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): కుంభమేళా తరహాలో తెలంగాణలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని తెలంగాణ  దేవాదాయమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని అన్నారు.  గోదావరి పుష్కరాలపై సోమవారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, హరీష్‌రావు, కేటీఆర్‌ సవిూక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విూడియాతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 69 ఘాట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పనుల నిర్వహణ తీరుపై విజిలెన్స్‌ నిఘా ఉంటదని స్పష్టం చేశారు. పుష్కరాలకు దేశ, విదేశాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. స్నాన ఘట్టాల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపారు. పుష్కరాలకు సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్‌ను తయారు చేస్తామన్నారు. ప్రధాన స్నాన ఘట్టా వద్ద పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఐదు జిల్లాలకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమిస్తామని చెప్పారు. పుష్కరాల నిర్వహణకు కేంద్రం సాయాన్ని కోరుతామని తెలిపారు. రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో పుష్కర ఉత్సవాలు అంగరంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.  పుష్కరాల నిర్వాహణకు ఇప్పటికే రూ.500 కోట్లు మంజూరు చేశామన్నారు.  కేంద్రం కూడా అదనంగా మరో రూ.100 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చిందన్నారు. . ఇంకా కావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. గతంలో పుష్కరాల సమయంలోనే కుప్పలు తెప్పలుగా నిధులు ఇచ్చే విధంగా కాకుండా.. ఈ సారి ముందుగానే నిధులిస్తున్నాంమని చెప్పారు.  ఆర్‌అండ్‌బీ, పంచాయితీరాజ్‌ శాఖల ద్వారా చేపట్టే రహదారుల పనులకు టెండర్లు పూర్తయ్యాయి. పుష్కరాల సమయానికి నెలరోజులు ముందుగానే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. . నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే ఉపేక్షించేది లేదని కూడా మంత్రి స్పష్టం చేశారు.  పారిశుద్ధ్యం మెరుగునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు కేంద్ర సాయం కోరతామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. పుష్కర ఏర్పాట్లపై సోమవారం ఇక్కడ అధికారులతో నిర్వహించిన సవిూక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.425కోట్లతో పుష్కరాలు నిర్వహించనున్నట్టు  పేర్కొన్నారు. 69ఘాట్లు నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు.