-గోదావరి వరదల నేపథ్యంలో అహర్నిశలు శ్రమిస్తున్న జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సేవలను కొనియాడుతున్న ప్రజలు.

ములుగు జిల్లా బ్యూరో, జూలై  (జనంసాక్షి):-
కొద్ది రోజులుగా విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల
గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహించింది. కనీవినీ ఎరుగని వరద ముంచెత్తింది.ఏటూరు నాగారం, వాజేడ్,వెంకటాపురం,మంగపేట,కన్నాయిగూడెం మండలాలు చిగురుటాకులా వణికిపోయాయి.ఊళ్లకు ఊళ్లు నీట మునిగాయి.వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. ఈ పరిస్థితుల్లో వరద బాధితులకు భరోసా కల్పిస్తున్నారు ములుగు జిల్లా ప్రజలకు నేను వున్న అంటూ జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య. వర్షాలు మొదలయిన నాటి నుంచి ముంపు ప్రాంతాల లోనే  ఉంటు అధికారులను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇళ్ల నుంచి ఎవరినీ బయటకు రావొద్దని చెబుతూ, ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.  అయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిద్రాహారాలు మాని కలెక్టర్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పునరావాస కేంద్రాలను సైతం తనిఖీ చేసి బాధితులకు మెరుగైన సౌక ర్యాలు కల్పిస్తున్నారు. ఏటూరు నాగారం లో వరద ముంపునకు గురైన పలు శివారు ప్రాంతాల్లో పర్యటించి అయా ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తర లించారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, పర్యాటక శాఖ  మంత్రి సత్యవతి రాథోడ్   కు ఎప్పటికప్పుడు నివేదికలు అందచేస్తున్నారు. జలప్రళయాన్ని దృష్టిలో పెట్టుకుని సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌ సైతం తెప్పించారు. 50 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. వరద సేవలకు పోలీస్ అధికారులను పెంచారు. వరద పెరుగుతున్నందున అత్యవసర సర్వీసుల కోసం నేవీ హెలిక్యాప్టర్లను సైతం రప్పించేందుకు ప్రతిపాదించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలో మందులను సిద్ధంగా ఉంచారు. మరిన్ని సేవలకు గానూ ఐటీడీఏ పీవో, ఐటీడీఏ అధికారులు,
ఇద్దరు సబ్‌ కలెక్టర్లు,పోలీస్ అధికారులు
ను వారం పాటు విధులు నిర్వహించేందుకు వరద ప్రాంతానికి రప్పించుకున్నారు.