గ్రానైట్ కార్మికులకు న్యాయం చేయాలి
మెదక్,మార్చి26 (జనంసాక్షి) : కార్మికులు రోడ్డునపడి 40 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యాలకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం శోచనీయం అని సీఐటీయూ జిల్లా నాయకులు అన్నారు. కార్మిక శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడానికి, ముందుకు రాకపోవడం వెనుక కారణాలో ఏమిటో తెలియాలని ఆయన ప్రశ్నించారు. వెంకటాపూర్‌లోని గ్రానైట్ పరిశ్రమ ముందు కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే కార్మికులకు భరోసా లేకపోతే రాష్ట్రంలోని కార్మికులను ప్రభుత్వం ఎలా అదుకుంటుందని అన్నారు. పరిశ్రమల్లో కార్మిక సంఘం ఏర్పాటు చేసినంత మాత్రాన పరిశ్రమ యాజమాన్యం ఆందోళనకు లోనై జీతభత్యాలు చెల్లించక పరిశ్రమనే మూసివేసే పరిస్థితి తలెత్తిందంటే కార్మికశాఖ అధికారులు కార్మికులకు ఏ విధంగా న్యాయం చేస్తారో తెలియడం లేదని అన్నారు. పరిశ్రమ యాజమాన్యం పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వందలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడినా పట్టించుకునే నాథబిడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.