గ్రామపంచాయతీలుగా మార్చేంతవరకు పోరాటం ఆపేది లేదు.
విలీన గ్రామాల ఐక్యవేదిక నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 8, (జనం సాక్షి). సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేసిన గ్రామాలను తిరిగి పంచాయతీలుగా కొనసాగించేంతవరకు పోరాటం ఆపేది లేదని విలీన గ్రామాల ఐక్యవేదిక నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు అన్నారు. శనివారం 9వ వార్డులో రెండవ రోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కమలాకర్ రావు మాట్లాడుతూ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసిన తర్వాత సమస్యల వలయంలో ప్రజలు చిక్కుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అనుమతుల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఉపాధి హామీ పనులు లేకపోవడంతో పేదల పరిస్థితి ధైన్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలకు కూడా మున్సిపాలిటీ పరిష్కారం చూపలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేసిన గ్రామాలను తిరిగి గ్రామపంచాయతీలో కొనసాగించేంతవరకు పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విలీన గ్రామాల ఐక్యవేదిక నాయకులు ఉలిసే తిరుపతి, ఎర్రవెల్లి శ్రీనివాసరావు ,భూక్య కిషన్ నాయక్ బాబాజీ కాలనీవాసులు పాల్గొన్నారు.