గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డీపీవో కి ఏఐటీయూసీ కార్మిక సంఘం విజ్ఞప్తి
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : గ్రామ పంచాయతీ కార్మికులకు తక్కువ వేతనాలు అధిక పని ఒత్తిడి సమస్యలను పరిష్కరించి, పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు డిమాండ్ చేశారు.
బుధవారం నాడు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పంచాయతీ వర్కర్స్ జీతలపైన వారి సమస్యల పరిష్కారం పైన జిల్లా పంచాయతీ అధికారి డీపీవో శ్యామ్ సుందర్ గారిని అలాగే డిఎల్పీవో గారిని కలసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు.
ఈసందర్బంగా ఎఐటియూసి నాయకులు డీపీవో గ్రామ పంచాయతీ వర్కర్స్ యెక్కపెండింగ్ జీతాలు,తక్కువగా ఇస్తున్న వేతనాలపైన, కార్మికల పని భారం పైన చర్చించారు. కచ్చితంగా ముడునెలల జీతాలతో పాటు, కొందరికి ఇస్తున్న తక్కువ జీతాలను కూడా 8500రూపాయలు అందరిలాగే ఇవ్వాలని డీపీవో ను ఆంజనేయులు కోరగా అందుకు ఎంపీడీఓ లతో చెప్పి వేయిస్తామన్నారు. ప్రతినెల జీతాలు క్రమం తప్పకుండ వేయాలని,వాటర్ మాన్ లను సెక్రటరీ చేత్తపనులు చేయాలనడం సరైనదికాదన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు భద్రత కల్పించాలని కోరగా అన్నిటి పరిష్కారం కై కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ, జిల్లా నాయకులు జంబయ్య, ఏఐఎస్ ఎఫ్ జిల్లా నాయకులు ప్రవీణ్, కావాలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.