గ్రామాన్ని సందర్శించిన కార్యదర్శులు

డోర్నకల్ జూలై   జనం సాక్షి
డోర్నకల్ మండలం బొడ్రాయి తండ గ్రామపంచాయతీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను డోర్నకల్ ఎంపీడీవో అపర్ణ, ఎంపీఓ మీర్జా మున్వర్ బేగ్  ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు సందర్శించారు
ఈ సందర్భంగా సర్పంచ్ తేజవత్  గమ్మి రాజు నాయక్ సారథ్యంలో గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను, వాటి నిర్వహణ తీరును కార్యదర్శులు సందర్శిస్తూ వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నర్సరీ, కంపోస్ట్ యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం,  చిల్డ్రన్స్ పార్క్, తెలంగాణ క్రీడా ప్రాంగణం తోపాటు గ్రామంలో జరుగుతున్న సానిటేషన్ పనులను ఎంపీడీవో ఎంపీవో, కార్యదర్శులకు వివరించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి అభినందించడంతో పాటు,  తాజాగా  ఢిల్లీ నుండి వచ్చిన సెంట్రల్ విజిలెన్స్ టీం కూడా ప్రత్యేకంగా అభినందించడంతో అన్ని గ్రామాల్లో ఇదే రకమైన స్ఫూర్తితో ఆయా పనులను చేపట్టాలని సూచించారు, బొడ్రాయి తండాను స్ఫూర్తిగా తీసుకొని  మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో పయనించాలని ఎంపీడీవో అపర్ణ ఎంపీవో మున్వర్ కోరారు
  ఇంకా ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తేజావత్ భాస్కర్..  తెరాస మండల నాయకులు తేజావత్ రాజు నాయక్ అంగన్వాడీ టీచర్ సేవ్ రి, కార్యదర్శి ప్రవీణ  తెరాస గ్రామ అధ్యక్షులు బానోత్ వెంకన్న,  కోఆప్షన్ నెంబర్ జవహర్ లాల్, ఉపాధ్యక్షులు జవహర్ లాల్,  మహిళా అధ్యక్షులు బుల్లభాష,  మాజీ గ్రామ అధ్యక్షులు తేజావత్ బాసు,  పవన్,  బిక్షం గ్రామపంచాయతీ సిబ్బంది  పాల్గొన్నారు.