గ్రామాల్లోకి కోడి కూయక ముందే వైన్స్ నిర్వాహకులు ఆటోలలో యథేచ్ఛగా సరఫ
రాయికోడ్ జనం సాక్షి 09 రాయికోడ్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోకి కోడి కూయక ముందే వైన్స్ నిర్వాహకులు ఆటోలలో యథేచ్ఛగా సరఫరా చేయడంతో బెల్టుషాపులు తెరుచుకుంటున్నాయి. అబ్బో అబ్బో వైన్స్ లు వద్దు బెల్టుషాపులే ముద్దు అన్నచాన్నంగా తయారైంది సంబందిత శాఖ తీరు.. ఒకవైపు మద్యం దుకాణాలపై పోలీస్ శాఖ దృష్టి సారిస్తుంటే, ఇంకోవైపు ఎక్సైజ్ శాఖ బెల్టుషాపులతో తమ పని తాము చేసుకుంటూ పోతుంది. మండల కేంద్రంలో వైన్స్ నిర్వహకులతో ధరల విషయంలోనే కాకుండా తమకు కావాల్సిన బ్రాండ్ వైన్స్ లల్లో దొరకాకుండా బెల్టుషాపుల్లో దొరుకుతున్నాయని సంబంధిత శాఖకు పలుమార్లు పిర్యాదు చేశారు. అయిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోకుండా వైన్స్ నిర్వాహకులతో కుమ్మక్కై వారికి తెలపడంతో వైన్స్ నిర్వాహకులు మద్యం ప్రియులపై బెదిరింపులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం ఆవుతున్నాయి. మద్యం దుకాణాలకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకు సమయ పాలన ఉండగా, బెల్టుషాపులు 24 గంటలు కిక్కేస్తున్నాయి. రాయికోడ్ మండల ప్రాంతంలో, ప్రజలకు ఉదయం ఆరు గంటలకే మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి. రాత్రి 10 గంటలకు ఖచ్చితంగా మద్యం షాపులు మూసి వేస్తుండగా, బెల్ట్ షాపుల్లో మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట, ఎప్పుడు అనుకుంటే అప్పటి వరకు కోరుకున్న మద్యం లభిస్తుంది. రాయికోడ్ మండల కేంద్రం తో సహా గ్రామాల్లోని గల్లీలల్లో పదుల సంఖ్యలోనే బెల్టుషాపులు ఉన్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మండల కేంద్రంలో 2 లైసెన్స్ మద్యం దుకాణాలు ఉన్న ఈ మద్యం దుకాణాల పరిధిలో దాబాలల్లో వివిధ గ్రామాల్లో, కాలనీలల్లో, కిరాణా షాపులు, కూల్ డ్రింక్ దుకాణాలు, హోటల్లు, గృహ నివాసాలు కేంద్రంగా బెల్టుషాపులు వెలిశాయి. రాయికోడ్ మండలంలోని ప్రతి గ్రామంలో 2 నుంచి ఐదు ఆరుకు పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా బెల్టుషాపులు సిట్టింగ్ లు ఏర్పాటు చేసివిచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తూ మద్యం ప్రియులను దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాయికోడ్ మద్యం షాపుల నుంచే బెల్ట్ షాప్ లకు కొందరు యజమానులు ఆటోలలో సరఫరా జరుపుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మండల కేంద్రంలో మద్యం షాపుల నుంచే బెల్టు షాపులకు మద్యం సరఫరా అవుతున్నట్లు తెలుస్తుంది. స్థానిక పోలీసులు పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ గుట్టుచప్పుడుగా మద్యం షాపుల యజమానులు గుట్టుగా బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నారనీ ప్రజలు, మహిళల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్టు షాపులపై ఏనాడు దాడులు చేసి చర్యలు తీసుకున్న సంఘటనలు లేవనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అలాగే జహీరాబాద్ డివిజన్ లోని ఎక్సైజ్ శాఖలో ఓ అధికారి 5 నుండి 7 సంవత్సరాలు గా పనిచేస్తూ వైన్స్ యజమానులతో కుమ్మక్కవ్వడమే కాకుండా బినామిలా పేర్లతో వైన్స్ లల్లో మెంబర్షిప్ ఉన్నాయనే ఆరోపణలు లేకపోలేవు. లైసెన్సు డు షాపుల మాదిరిగా బెల్టు షాపులు తామేమీ తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. మద్యం షాపుల నుంచి క్వార్టర్, బాటిల్, ఆఫ్ బాటిల్ తీసుకువెళ్లి బెల్ట్ షాపుల్లో కల్తీ చేస్తున్నారని, అతిగా మద్యం అలవాటు పడ్డ మద్యం ప్రియులు బెల్టు షాపుల పైనే ఆధారపడి ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇటీవల కాలంలో గుడుంబా వ్యాపారం చేసిన వారు సైతం బెల్టుషాపు దందాలకు దిగుతున్నారు. వీరికి ఎక్సైజ్ అధికారులు సహాయ సహకారాలు అంద చేస్తున్నారనే విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. రాయికోడ్ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో గల్లి గల్లికో బెల్టు దుకాణం ఏర్పడడం, విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలతో యువత మద్యం మత్తులో పడుతుండడంతో అసాంఘిక కార్యకలాపాలు నిత్యం పెరిగిపోతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా మండలంలోని చెర్ల రాయిపల్లి గ్రామంలో ఓ యూవకుడు బెల్టుషాప్లో మద్యం సేవించి అంబెడ్కర్ విగ్రహం చేతిని విరగ్గొట్టి కేసు అయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆ గ్రామ వాసూలే స్టేషన్ వద్ద తెలిపిన సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా బెల్టు దుకాణాలు నిర్వహించడం వల్ల మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి. యువకులు అందుబాటులో ఉన్న మద్యం దుకాణాల వైపు పరుగులు పెడుతూ మత్తులో ఊగిపోతున్నరనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో చాయి హోటల్లు, దాబాలు, కిరణ షాపులు బార్లను తలపించేలా సిట్టింగులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు.మద్యం బెల్టు దుకాణాల జోరుతో అనేకమంది జేబులు గుల్ల చేసుకుంటున్నారని,దీని వల్ల ఆయా కుటుంబాల్లో నిత్యం తగాదాలు జరుగుతున్నాయని,అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై అధికారులు దృష్టి సారించకపోవడం వల్లే యధేచ్ఛగా మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా,శాంతియుత వాతావరణం కల్పించేందుకు అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టు షాపు దుకాణాలపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.మద్యం వ్యాపారులు బెల్టు షాపుల నిర్వాహకుల వద్ద ఎమ్ఆర్పి రేటు కంటే బెల్టు షాపుల నిర్వహకులకు రూ.10నుంచి రూ.20 రూపాయలను అదనంగా తీసుకోవడంతో గ్రామాల్లోని బెల్టుషాపుల వ్యాపారులు మరో అదనంగా మద్యం ప్రియుల వద్ద రూ.20 నుంచి 60 రూపాయల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బహిరంగంగా మద్యం తాగడం,మద్యం షాపుల్లో కల్తీ సమయ పాలనపై స్థానిక పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నాప్పటికి. సంబంధిత ఎక్సైజ్ శాఖ తీరుతో మద్యం గుట్టుచప్పుడుగా, విచ్చలవిడిగా బెల్టు షాపుల్లో క్రయ విక్రయాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ శాఖకు మద్యం వ్యాపారుల కంటే బెల్టు షాపుల నిర్వాహకుల నుంచే మామూళ్ల ఆదాయం ఎక్కువగా ఉన్నట్లు ఇక్కడ ప్రచారం జరుగుతుంది.గతంలో మద్యం షాపు నుంచి బెల్టు షాపులకు మద్యం సరఫరా జరిగేదని,ఆ మద్యం షాపు నిర్వాహకుడే ఎక్సైజ్ బాధ్యత చూసుకునే విధంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. కానీ ఈ సారి ఎక్సైజ్ శాఖలో కొత్తగా సిబ్బంది మద్యం వ్యాపారులను, బెల్టుషాపులను సమన్వయ పరచుకోవడంతో పాటు బెల్టుషాపుల అమ్మకాల సామర్థ్యాన్ని బట్టి నెలకు కొంత మామూళ్లు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఇటు మద్యం,అటు బెల్టుషాపులపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడoతోనే మద్యం వ్యాపారులు, బెల్టుషాపు వ్యాపారుల పంట ఆడింది ఆటగా, పాడింది పాటగా నడుస్తుందని మంథని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బెల్టు షాపులపై కన్నేసి మద్యం ప్రియుల కుటుంబాలను కాపాడవలసిన బాధ్యత ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.