గ్రామ ప్రగతి నివేదికలను సకాలంలో పూర్తి చేయాలి…
– కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య….
జనగామ కలెక్టరేట్ జూలై 28(జనం సాక్షి): గ్రామ ప్రగతి నివేదికలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి సూచనల మేరకు ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో గ్రామ ప్రగతి నివేదికలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ప్రగతి నివేదికలను సంబంధిత అధికారులు రెండు రోజుల లోగా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.
ప్రతి నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున వ్యక్తిగత లబ్ధిదారుల సమాచారం సామూహిక లబ్ధిదారుల వివరాలను నిర్ణీత నమూనాలలో సమర్పించాలన్నారు.అదే విధంగా వివిధ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను ఉద్దేశించి మాట్లాడుతూ పనులు సకాలంలో పూర్తికాగానే వినియోగ ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రసంగాన్ని రూపొందించుటకై వివిధ శాఖల ప్రగతి నివేదికలు సంక్షిప్త రూపంలో ముఖ్య ప్రణాళిక అధికారికి సమర్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, సిపిఓ ఇస్మాయిల్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.